Sunday, May 5, 2024

1998 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. సీఎం సంతకంతో సమస్యకు పరిష్కారం

అమరావతి, ఆంధ్రప్రభ: 1998 డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సంతకం చేయడంతో 20 ఏళ్ల నాటి నుంచి ఉన్న సమస్యకు పరిష్కారం జరిగినట్లైంది. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ రాసిన అభ్యర్థుల నియామకాలు 24 ఏళ్లుగా కోర్టు కేసులు, ఇతర సమస్యలతో పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిపై ఏళ్లుగా అభ్యర్థులు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, మంత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజాగా సీఎంవో అనుమతి లభించడంతో త్వరలో వారికి పోస్టింగులు దక్కనున్నాయి. ఈ సందర్భంగా ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ ప్రభుత్వం న్యాయం చేసిందని వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గిరి ప్రసాద్‌, మల్లు శ్రీధర్‌ రెడ్డి, ఏపీయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.

వారికి న్యాయం జరగడానికి సహకరించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి లకు కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా ఈ సమస్య కోసం దీర్ఘకాలంగా పోరాటం సాగిస్తున్న వైయస్సార్‌ 98 డీఎస్సీ అభ్యర్థుల అసోసియేషన్‌ అధ్యక్షులు సోమశేఖర్‌ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement