Thursday, May 2, 2024

బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు 100 వాహనాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని బ్రాహ్మణ నిరుద్యోగులకు సబ్సిడీపై 100 క్యాబ్‌ టాక్సీలు ఇవ్వనున్నట్లు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ తెలిపారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో డ్రైవింగ్‌ వృత్తిలోని వారికి ఏపీ బ్రాహ్మణ సహకార పరపతి సంస్థ సహకారంతో ‘చాణక్య లఘు పారిశ్రామిక వేత్తల పథకం-రవాణా ఆపరేటర్‌’ పథకం కింద వీటిని సమకూర్చనున్నట్లు తెలిపారు. పెట్రోల్‌ టాక్సీ రూ.7.25లక్షల్లో కార్పోరేషన్‌ సబ్సిడీ రూ.రెండు లక్షలు, లబ్దిదారుల వాటా రూ.72,500గా ఉంటుందని, ఇదే డిజైర్‌ టూర్‌ సీఎన్‌జీ/పెట్రోల్‌ టాక్సీ రేటు రూ.8.25లక్షలకు గాను కార్పోరేషన్‌ సబ్సిడీ రూ.రెండు లక్షలు, లబ్దిదారుల వాటా రూ.85,500గా ఉంటుందని ఆయన తెలిపారు. ఏపీ బ్రాహ్మణ పరపతి సహకార సంస్థ మంజూరు చేసిన రుణంలో అసలు, వడ్డీ చెల్లించిన తర్వాత సబ్సిడీ మొత్తం విడుదల చేస్తారని పేర్కొన్నారు. రూ.లక్ష లోపు వార్షిక ఆదాయం ఉన్న ఏపీకి చెందిన 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు ఇందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు.

డ్రైగింగ్‌లో అనుభవముండి శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు బ్యాడ్జి నంబర్‌ కలిగిన వారు ఇందుకు అర్హులని తెలిపారు. బ్యాడ్జి లేని పక్షంలో డ్రైవర్‌గా గుర్తింపు కార్డు ఉండాలని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ యువతకు ఈ పథకం ద్వారా ఎంతగానో లబ్ది చేకూరుతుందని తెలిపారు. దరఖాస్తు దారులు పదో తరగతి చదువుకొని ఖచ్చితంగా బ్రాహ్మణ కో-ఆపరేటివ్‌ సొసైటీ సభ్యుడై ఉండాలన్నారు. చాణక్య పథకం కింద కార్పోరేషన్‌ నుంచి ఏవిధమైన ఆర్థిక సహకారం, రాయితీ, ప్రభుత్వం నుంచి ఇదే తరహా లబ్ది పొందిన పక్షంలో ఇందుకు అనర్హులన్నారు. కుటుంబంలోని రేషన్‌ కార్డుదారుల్లో ఒకరికి మాత్రమే రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన లబ్దిదారులు జూన్‌ 15లోగా ఆన్‌లైన్‌లో నిర్థేశిత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని సుధాకర్‌ సూచించారు. తగిన సమాచారం కోసం బ్రాహ్మణ కార్పోరేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని, పని దినాల్లో 0866-6650300, 6650345లో సంప్రదించాలని సీతంరాజు సుధాకర్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement