Friday, May 17, 2024

సమస్య వస్తే గుర్తొచ్చేది పవనే.. ఉత్తరాంధ్ర పర్యటన ఎన్నో పాఠాలు నేర్పింది : పీఏసీ సభ్యుడు నాగబాబు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎవరికైనా, ఏదైనా సమస్య వస్తే మొదట గుర్తొచ్చేది పవన్‌ కల్యాణ నని, పవన్‌ వెళితే సమస్య తీరుతుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు అన్నారు. శనివారం విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ నాయకులు పని చేయకపోతే చేయి మెలిపెట్టి ప్రశ్నించే స్ధాయికి జనసైనికులు ఎదిగారన్నారు. పవన్‌ను తన నాయకుడిగా భావించడానికి తనకు మూడేళ్లు పట్టిందని, సమస్యలపై వెనుదిరగకుండా నిలబడే తీరు నాయకుడికి ఉండే లక్షణమని, అది పవన్‌లో ఉందని పేర్కొన్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో చేసిన పర్యటన తనకెన్నో పాఠాలు నేర్పించిందని, కార్యకర్తల కష్టాన్ని దగ్గరుండి చూశానని అన్నారు. ఉత్తరాంధ్ర కార్యకర్తలు మోటివేట్‌ అయి ఉన్నారని, ఉత్తరాంధ్రలో సమస్య వస్తే పవన్‌ అవసరం లేదు, జన సైనికులు వస్తే చాలని భావించేంతలా నమ్మకం ఏర్పడిందని వివరించారు. అయితే ఉత్తరాంధ్రలో కొంత లీడర్‌ షిప్‌ సమస్య ఉందని, త్వరలో పరిష్కారమవుతుందని తెలిపారు. అక్రమ మైనింగ్‌, ఇసుక తవ్వకాలపై జనసైనికులు పోరాట ప్రతిమ అమోఘమని, ఎన్నికల్లో డబ్బు ప్రలోభాలు పెట్టినా పోటీ చేసి ఓడినా నైతికంగా గెలిచారని పేర్కొన్నారు.

విశాఖ రుషికొండ వ్యూ చాలా అద్భుతమైనదని, ఆ రుషికొండను కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేనేనని నాగబాబు స్పష్టం చేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఎర్ర కొండలు తినేస్తున్నాడని, ఈ పాటికే ఒక కొండ తినేసి ఉండుంటాడని సెటైర్లు వేశారు. పార్టీ కోసం తామేం చేస్తున్నామని ప్రతి జనసైనికుడు ఆలోచించాలని సూచించారు. వైసీపీలో లంచగొండితనం సింగిల్‌ విండోలా మారిపోయిందని విమర్శించారు. జనసేన కౌలు రైతులను పట్టించుకోలేదని అనడం కన్నా.. జగన్‌, చంద్రబాబు శాసనసభను కౌలుకు తీసుకొని లక్ష ఇవ్వొచ్చుగా అని ఎద్దేవా చేశారు. పవన్‌ నిప్పుల్లో దూకమంటే దూకుతామనే కార్యకర్తలు ప్రస్తుతం పార్టీకి అవసరమన్నారు. మిలి-టె-ంట్‌ మైండ్‌ సెట్‌ కలిగినోళ్లు జనసేన సైనికులని, ఎవరినైనా గ్రౌండ్‌లో పాతరేయడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ విషయం పవన్‌కు తెలుసునని, అయినా అగ్రెసివ్‌గా వెళ్లవద్దని చెబుతుంటారని, సంయమనం అంటే అదేనని తెలిపారు. స్వార్ధం, కన్నింగ్‌ మైండ్‌, లంచగొండితనం లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని, పవన్‌ చెప్పింది వింటే 2024లో ఆయన్ను సీఎంగా చూసుకోవచ్చని నాగబాబు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement