Monday, May 20, 2024

నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్.. అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

అంతరించిపోతున్న జాతులలోని నక్షత్ర తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఏపీ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (SEB) పోలీసులు అరెస్టు చేశారు.  ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు.. అక్రమంగా నక్షత్ర తాబేళ్లను రవాణా చేస్తుండగా సెల్వకుమార్ రవికుమార్‌ను పట్టుకున్నారు. 250 నక్షత్ర తాబేళ్లను కూడా రక్షించారు.

కాగా, సెల్వకుమార్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల నిమిత్తం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వన్యప్రాణుల రక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement