Sunday, May 5, 2024

Tirumala | శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..

Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జనవరి నెల‌ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం బుధవారం (18న) ఉదయం 10 గంటల నుంచి.. 20న ఉదయం 10 గంటల వరకు పోన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు.. 22న మధ్యాహ్నం 12 గంటల్లోగా రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే కల్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను 21న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. వర్చువల్‌ సేవా టికెట్లను 21న మధ్యాహ్నం 3గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement