Monday, April 29, 2024

టీడీపీ ఎన్టీఆర్ కుటుంబానిది..చంద్ర‌బాబుది కాదు.. పెద్దిరెడ్డి..

తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కుటుంబానికి ఇస్తే మంచిద‌ని అన్నారు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. స‌ర్పంచ్ ఎల‌క్ష‌న్స్ లో సొంత ఇలాక అయిన కుప్పంలో కూడా చంద్ర‌బాబు గెల‌వ‌క‌పోవ‌డంపై సెటైర్స్ వేశారు. అస‌లు టిడిపి పార్టీ చంద్ర‌బాబుదే కాద‌న్నారు. సొంత నియోజకవర్గంలోనే మూలాలు పోయిన తర్వాత ఇంకా చంద్రబాబు కొనసాగటం కరెక్ట్ కాదని .. చంద్రబాబు తప్పుకోవాల‌న్నారు. రాష్ట్రంలో వైసీపీ ఒక జిల్లా కు‌, మున్సిపాలిటీ కి పరిమితం కాలేదని అర్థం అయ్యిందని.. సర్పంచ్ ఎన్నికలలో చంద్రబాబు గెలువలేని పరిస్థితి ఉందని చురకలు అంటించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయవాణి హైస్కూల్ ను టీడీపీ నేతలు ధ్వంసం చేశారని చెప్పారు. ప్రజలు ఛీ కొట్టిన తర్వాత ఇంకా చంద్రబాబు కుప్పం గురించి మాట్లాడతారని నేననుకోనని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement