Saturday, May 4, 2024

Survey Tension – అభ్య‌ర్ధుల‌లో వెంటాడుతున్న గెలుపోట‌ముల భ‌యం….స‌ర్వేల‌తో స‌మ‌న్వ‌యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపోట ము లపై ప్రభావం చూపే అంశాలను విశ్లేషించుకుంటూ కార్యా చరణ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో 20 రోజులు మాత్రమే గడువు ఉండ డంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ప్రచా రాన్ని ఉధృతం చేశారు. కాగా ఎన్నికల బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులుగా పోటీ- చేస్తున్న నేతల బలాలు, బలహీనతలపై సమాచారం సేకరించి ఆ దిశగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రూపొం దిం చు కుంటు-న్నారు. ఇందుకు సర్వే సంస్థల సహకారం తీసు కుంటు-న్నట్టు- సమాచారం. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సిట్టిం గ్‌ ఎమ్మెల్యేలను బరిలో నిలపగా కాంగ్రెస్‌, బీజేపీ అధి నాయకత్వాలు బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టేందుకు ఉద్దండులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ గెలుపు అవకాశాలను తెలుసు కునేందుకు రోజువారీ సర్వేలు జరిపించుకుని అందులో వస్తున్న ఫలితాల మేరకు ప్రచారంలో తమ వ్యూహాన్ని మార్చుకుంటు-న్నట్టు- ప్రచారం జరుగుతోంది. ఇలా సర్వేలు చేయించుకుంటు-న్న వారిలో అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు కూ డా ఉన్నట్టు- తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు సైతం ఇందులో భాగస్వామ్యం అయినట్టు- చెబు తున్నారు. ప్రతి రోజూ ఎంపిక చేసుకున్న మండలాలు, మేజర్‌ గ్రామ పంచాయతీలకు వెళ్లడం అక్కడ విపక్ష పార్టీ అభ్యర్థుల ప్రచార తీరు ఇస్తున్న హామీలు అధ్యయనం చేసి సాయంత్రానికల్లా నివేదికలు ఇవ్వడం వంటి ప్రక్రియ కొన సాగుతున్నట్టు- చెబుతున్నారు. అభ్యర్ధికి మద్దతుగా ప్రచా రం చేస్తున్నదెవరు, వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి వివ రాలను కూడా సర్వే సంస్థల ప్రతినిధులు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్‌ ఆశించి దక్కకపోవడం తో అసంతృప్తిగా ఉన్న నేతలు టికెట్‌ ఖరారైన అభ్యర్థి విజయానికి పనిచేసు ్తన్నా రా లేక సమర్థిస్తూనే గోతులు తవ్వుతున్నారా అనే అంశాలను కూడా రాబట్టి ఆ సమా చారా న్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నట్టు- చెబు తు న్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే సర్వే సంస్థలతో రోజువారీ సమా చారాన్ని సేకరిం చేందుకు సర్వే జరిపించుకుంటు-న్నట్టు- సమాచారం. సదరు ఎమ్మెల్యే అభ్యర్థి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పక్షాన పోటీ- చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా సదరు ఎమ్మెల్యే అధి కార పార్టీ గూటికి చేరారు. ఈ ఎన్నికల్లో మళ్ళీ పోటీ-కి దిగా రు. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఒకరు టికెట్‌ ఆశించినా పార్టీ అధి నాయ కత్వం ఆ నాయకుడికి టికెట్‌ నిరాకరించింది. దీంతో ఆ మాజీ మంత్రి ఈ ఎన్నికల్లో తన కు సహకరిస్తాడో లేదో అన్న భయంతో ఆయన కదలి కలను తెలుసుకునేందుకు సర్వే చేయించు కుంటూ అందులో వస్తోన్న సమా చారం ఆధా రంగా ప్రచార సరళిలో మార్పులు చేర్పులు చేసుకుంటు-న్నట్టు- చెబు తున్నారు.

పార్టీ టికెట్‌ దక్కాక ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న విషయంపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. సర్వే ల్లో అనుకూల ఫలితాలొస్తే డబ్బు ఖర్చు చేయాలా వద్దా అనే అంశంలో స్పష్టత వస్తుందని అభ్యర్థులు భావిసు ్తన్నట్టు- సమాచారం. ఒకవేళ ఎన్నికల్లో ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నట్టు- తేలితే ఎంత ఖర్చయినా సరే పెట్టా లన్న యోచనలో ఉన్నట్టు- భావిస్తున్నారు. ఒకవేళ సర్వేలో వ్యతిరేక ఫలితాలు వస్తే ఏ విధంగా గెలుపు బాట వేసు కోవాలన్న దానిపైనా కసరత్తు చేసుకుంటు-న్నారు. అంతె కాకుండా తమ ప్రత్యర్థుల బలాన్ని కూడా అంచనా వేసు కుని వ్యూహం మార్చాలని సమాలోచన చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లతో పాటు-, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు వేసు కుంటు-న్న కొత్త ఎత్తుగడలు. పోలింగ్‌లోపు నియో జకవర్గాల నుంచి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుం దనే దానిపైనా అభ్యర్థులు సమా చారాన్ని తెలుసు కునే పనిలో పడ్డట్టు- తెలుస్తోంది.

- Advertisement -

ఓటర్ల నాడి తెలుసుకునేందుకు..
తెలంగాణలోని యాభైకి పైగా నియోజకవర్గాల్లో తమ సత్తా చాటేం దుకు ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు సర్వే లు జరిపించుకుంటు-న్నట్టు- సమాచారం. ఒక పక్క ప్రభు త్వంపై వ్యతి రేకత, మరో పక్క సెగ్మెంట్లలో సొంత పార్టీ నేతల నుంచి అసంతృప్తుల పరిస్థి తిపై ఆరా తీస్తున్నారు. పైకి తామే గెలుస్తా మన్న ధీమాతో ఉన్నా లోలోపల.. సొం తపార్టీ నేతల నుంచి, ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రతిపక్ష పార్టీలు బలం పుంజుకోవడం వంటి పరిణామాలతో కొం దరు అభ్యర్థులు -టె-న్షన్‌ పడుతున్నారు. దీంతో తమ పరిస్థితి ఎలా ఉందనే దానిపై సర్వేలు చేయించుకుంటూ అందులో వచ్చే రిపోర్ట్‌ల ఆధారంగానే ఎన్నికల ప్రచా రంలో వ్యూహం మార్చి ముందుకెళుతున్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌ నగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో అత్యధికంగా అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు ఈ సర్వే లలో ముందున్నట్టు- సమాచారం. ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పేరుతో పార్టీ తీరు ఎలా ఉందనే దానిపై ప్రజల వద్దకు వెళ్లి వాకబు చేస్తున్నారు. హైదరాబాద్‌ జంటనగరాల్లోని జూబ్లీ హిల్స్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌లో కూడా ఆ పార్టీ నేతలు సర్వేలు నిర్వహించుకుంటు-న్నారు. ముషీ రాబాద్‌, అంబర్‌పేట, సనత్‌ నగర్‌లలో విపక్ష పార్టీల అభ్య ర్థులు కొందరు సర్వే జరిపించుకుంటు-న్నట్టు- చెబుతు న్నా రు.

బీజేపీ నేతలు కూడా సర్వేలపై ఆధారపడుతున్నట్టు- సమాచారం. ఈసారి పోటీ-లో ఉన్న నేతలు తమ రాజ కీయ భవిష్యత్‌పై అంచనాకు రావడానికి సర్వేలనే ప్రామా ణికంగా భావిస్తున్నట్టు- తెలుస్తోంది. ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా వారిని ప్రసన్నం చేసు కునేందుకు ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలన్న అంశాలపై పలు రకాలుగా కసరత్తు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి టికెట్లు- దక్కించుకున్న నేతలు కూడా సెగ్మెంట్లలో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement