Thursday, May 9, 2024

Shopian: ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున షోపియాన్‌లోని కతోహలెన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టామని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. అతడిని ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement