Friday, May 17, 2024

గంగాదేవి ప్రతిష్టిత క్షేత్రం గంగోత్రి

దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యంత విశిష్టమైనది. గంగాపుష్కరాలు జరుగు గంగానది పరీవాహక ప్రాంతాలలో ప్రధమ స్థానం గంగోత్రిది. ఇక్కడ గంగానది భాగీరధి పేరుతో పిలువబడుతుంది. ఉత్తరకాశీకి సుమారు 100 కి.మీ. దూరంలో గంగానదికి పుట్టుక అయిన భాగీరధి నదీ తీరంనందు గంగోత్రి ఆలయము వుంది. ఈనెల 22వ తేదీ నుంచి గంగానది పుష్కరాలు ప్రారంభమవుతున్న సందర్భంగా 22వ తేదీన గంగోత్రి ఆలయం తెరుచుకుంటున్న సందర్భంగా గంగోత్రి విశేషాల కథనం…
చార్‌దామ్‌ క్షేత్రాలలో ముఖ్యమై నది గంగోత్రి సముద్ర మట్టానికి సుమారు 4వేల మీటర్ల ఎత్తులో హమా లయ పర్వతశ్రేణులలో వుంది. ఈ క్షేత్రంలోని ఆలయంలో గంగానదిని ముఖ్యదేవతగా కొలుస్తారు. గంగాదేవి భువికి రావడానికి, ఇక్కడ కొలువై వుం డడానికి పురాణాలు చెప్పిన కథ ఇది.
పూర్వం భగీరధుని ముత్తాత సగర మహారాజు రాక్షస సంహారం తరువాత పాప పరిహారార్థం అశ్వమేధ యాగం చేసి యాగాశ్వం (గుర్రాన్ని) భూమిపై సంచరించడానికి విడిచిపెట్టాడు. అశ్వము సాగుచుండగా అశ్వమేధ యాగం సక్రమంగా పూర్తిఅయిన తాను ఇంద్ర పదవి కోల్పోవలసి వస్తుందని ఇం ద్రుడు అశ్వమును కపిల మహర్షి ఆశ్రమంనందు కట్టివేసాడు.
సగరుడు తన 60వేల మంది కుమారులను గుర్రాన్ని వెతకడానికి పంపాడు. వారు గుర్రా న్ని వెతుకుతూ కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు ఆశ్రమంలో గుర్రం కట్టివేయబడి ఉండుట చూసి ఋషి గుర్రాన్ని బంధించాడని భావించారు. ఆ సమయంలో తపస్సులో ఉన్న కపిల ముని ధ్యానానికి భంగం కలిగించారు. కపిల మహర్షి ఆగ్రహంచి సగర మహారాజు 60వేలమంది కుమారులను తన యోగదృష్టితో కాల్చి బూడిద చేసాడు.
సగర రాజు తన మునిమనవడు భగీరథుడుని కుమారుల ఆత్మల మోక్షానికి పరిహారం కపిల మహర్షిని అడగడానికి పంపాడు. భగీరథుని ప్రార్థనలకు సంతోషించిన కపిల మహర్షి, మరణించిన 60వేల మంది ఆత్మలు స్వర్గం నుండి గంగా ప్రవాహంతో తర్పణం చేయడం ద్వారా శాపం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాయని పరిహారం తెలిపాడు.
భగీరధుడు గంగను దివినుండి భువికి తీసుకురావడానికి బ్రహ్మ, శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. భగీరధుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని, శివుని అనుగ్రహం పొందాడు. బ్రహ్మ గంగ భూమిపైకి రావడానికి అనుమతించగా, శివుడు గంగను తన కేశముల ముడి నందు బంధించి, ఆమె వేగాన్ని అదుపుచేసి భూమిపై ఒక ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. గంగ ప్రస న్నురాలై శివుని జటాఝూటం నుండి గంగోత్రి వద్దనే భువికి దిగి వచ్చింది. ఈ నది గంగో త్రికి 19 కిమీ దూరంలో గల ఒక చిన్న పర్వత సానువు వద్ద ప్రారంభమవుతుంది. భగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా ఉద్భవించిన గంగ 18 కి.మీ., దూరం ప్రయాణించి గోముఖం అనేచోట నేల మీదకు దూకుతుంది. భగీరధుని ప్రయత్నంవల్ల భూమిపైకి వచ్చింది కావున భగీరధి అని పేరుపడింది. గంగోత్రి దగ్గర గంగానది సుమారు 50 లేక 60 అడుగుల వెడల్పు ఉంటుంది. నిజానికి గంగ మొట్టమొదట నేలమీదకు దిగింది ఈ గంగోత్రి దగ్గరే. కానీ, కలియుగంలో మానవుల పాపం పెరిగిన కొద్దీ, గంగ కొద్దికొద్దిగా వెనుకకు జరుగుతూ పోతుంటుందని, అలా ఇప్పటికి గోముఖ్‌ అని పిలవబడే స్థలంవరకూ వెనుకకు వెళ్ళినదని, కలియుగం పూర్తయ్యే టప్పటికి పూర్తిగా కనిపించకుండా పోతుందని పండితుల మాట. గోముఖంనుంచి గంగోత్రి చేరేవరకూ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. గంగోత్రి నుండి తీసుకు వెళ్ళిన నీటితో రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామికి నిత్యాభిషేకం చేస్తారు.
నది ఒడ్డున గంగామాత ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మొదట 18వ శతాబ్దంలో అమర్‌సింగ్‌ థాపా అనే నేపాలీ సైనికాధికారి నిర్మించాడు. అది కొంత కాలానికి శిధిలమవ్వగా జైపూర్‌ సంస్థాన వంశస్థులు వెన్నలాంటి తెల్లచలువరాయితో పునర్నిర్మించాడు. మండపం, మూడు గర్భాలయాలు, గంగ, యమున, సరస్వతి, లక్ష్మీ, పార్వతి. అన్నపూర్ణల విగ్రహమూ ర్తులు ఆలయంలో ఉన్నాయి. ఆలయానికి ప్రక్క మూసి ఉన్న గదిలో భగీరథుడు గంగను గూర్చి తపస్సు చేసిన ‘భగీరథ శిల’ అని పిలువబడే ఒక చిన్నరాతి వేదిక ఉంది. ఆలయ ప్రాం గణంలోనే శివుడు, వినాయకుడు, ఆంజనేయుడు, మొదలగు దేవతామూర్తులకు చిన్నచిన్న మందిరాలు కూడా ఉన్నాయి. ఆలయంలో ప్రతీరోజూ ఉదయం ఆరు గంటలకు, మధ్యా హ్నం 12 గంటలకు తిరిగి సాయంత్రం 7 గంటలకు గంగామాత హారతి ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement