Wednesday, May 1, 2024

దేశానికే మెడికల్ హబ్ గా తెలంగాణ : హ‌రీశ్ రావు

దేశానికే మెడికల్ హబ్ గా నేడు తెలంగాణ ఆవిర్భవించింది, 2014కు ముందు 20 మెడిక ల్ కాలేజీలు ఉంటే, 2022 నాటికి 46కు చేరుకున్నాయి.. ఈ ఏడాది 9 కలుపుకుంటే మొత్తం 55కు సంఖ్య చేరుతుంద‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి భూమిపూజ చేశారు. అనంత‌రం మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దీన్ని నిర్మిస్తున్నారు అన్నారు. జాతీయ రహదారి మీద ప్రమాదాలు జరుగుతాయి క‌నుక‌ అందుకే ఇక్కడ ఏర్పాటు చేశాం అన్నారు. అత్యవసర సమయాల్లో హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వైద్యం పొందటం వీలవుతుంది. గోల్డెన్ అవర్ లో చికిత్స అందించి, తద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్యం గురించి రూ.1300 కోట్ల పనులు చేసుకుంటున్నాం. ఇందులో చాలా వరకు పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయి. నల్లగొండ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉంది. ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతంలో పర్యటించిన కేసీఆర్‌ ఇక్కడి ప్రజల అవస్థలు చూసి చలించిపోయారు. నాంపల్లి, మునుగోడు, చండూరు, నారాయణ్ పుర్ పి హెచ్ సి 24 గంటల పాటు ఉండేలా చేస్తాం అన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం నల్గొండకు ఎంతో చేశారు. రాష్ట్రం వచ్చాక నాలుగు ఇస్తే, రెండు మెడికల్ కాలేజీలు నల్గొండ, సూర్యాపేట ఇచ్చారు. ఎయిమ్స్ అతీగతీ లేదు. ఓపీ తప్ప, ఐపీ లేదు అన్నారు. 2018 ప్రారంభం అయితే మొన్న వచ్చి మోడీ భూమి పూజ చేసారు. ఎయిమ్స్ పై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా, సీఎం కేసీఆర్ 8 మెడికల్ కాలేజీలు ప్రారంబించారు. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారు. ప్రతి నియోజక వర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. నాడు 3 ఉంటే, నేడు 102డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామ‌న్నారు. మరు మూల ప్రాంతాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంద‌న్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామ‌ని, రానున్న రోజుల్లో 500 వరకు బస్తి దవాఖాన సంఖ్య పెరుగుతుంద‌న్నారు. ఊరూరా పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ప్రభుత్వం వేద్యం పై ప్రజలుకు నమ్మకం పెరిగింది, ఏప్రిల్ చివరి లోపు రాష్ట్రం అంతటా న్యూట్రిష కిట్లు అందిస్తాం అన్నారు. జిల్లాల్లో కీమో థెరపీ సేవలు ప్రారంభిస్తున్నాం.. సూర్యాపేట లో కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు.

తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య తెలంగాణ నిర్మాణంపై ఆలోచన ఉన్న సీఎం కేసీఆర్.. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా చూస్తూ కూర్చోలేదు.. చేతల్లో చూపెట్టాడు అన్నారు. రాష్ట్ర సొంత నిధులతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తనని ప్రకటించి, అమలు చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఏం వచ్చిందనే వారికి, మీ కండ్ల ముందే జరుగుతున్న అభివృద్ధే సమాధానం. మారుమూల ప్రాంతాలు సైతం కొత్త జిల్లాలు కాగా, ఆ కొత్త జిల్లాలకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వచ్చాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, నాగర్ కర్నూల్ వంటి మారుమూల జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతాయని కలలో అయినా అనుకున్నామా.. కలలో కూడా అనుకోని దాన్ని సీఎం కేసీఆర్ ఇలలో చేసి చూపెట్టారు. తెలంగాణ రాక ముందు సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నా, వైద్య విద్య అన్నా.. తెలంగాణ ప్రజలకు అందని ద్రాక్ష.. వైద్యం కోసం జిల్లాలు దాటి హైదరాబాద్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి.. ఇక వైద్య విద్య కోసం దేశాలు దాటాల్సిన దుస్థితి వ‌చ్చేది. ఉమ్మడి పాలనలో సరైన వైద్యం అందక ప్రజలు అనుభవించిన నరకయాతనను కండ్లారా చూసిన సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో రాష్ట్ర సొంత నిధులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. గ‌తేడాది ఒకేసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా, 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోగా, ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకునే దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు. నాడు వైద్యానికి, వైద్య విద్యకు కరువు ప్రాంతంగా ఉన్న రాష్ట్రం నేడు, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి, నాణ్యమైన వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దేశానికే మెడికల్ హబ్ గా నేడు తెలంగాణ ఆవిర్భవించింది అన్నారు. 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, 2022 నాటికి 46కు చేరుకున్నాయి. ఈ ఏడాది 9 కలుపుకుంటే మొత్తం 55కు సంఖ్య చేరుతుంద‌న్నారు. 65 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏండ్లలో 35 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగింది. మెడికల్ సీట్లు నాడు 2950 ఉంటే, ఇప్పుడు 7090కి పెరిగింది. ఈ ఏడాది 9 కాలేజీల్లో సీట్లు కలుపుకుంటే 7990 అవుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement