Wednesday, September 27, 2023

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.60ల‌క్ష‌లు స్వాధీనం

ప్ర‌తి వేస‌వి కాలంలో ఐపీఎల్ మ్యాచులు జ‌రుగుతాయి. అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్ లను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తుంటే.. కొందరు అక్రమార్కులు మాత్రం క్యాష్ చేసుకుంటున్నారు. బెట్టింగ్లు నిర్వహిస్తూ డబ్బులను సంపాదించుకుంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. న‌గ‌దుతో పాటు పలు కంప్యూటర్స్, లాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement