Tuesday, May 21, 2024

Bumper Offer – టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే…. విశాఖ బీచ్ లో న్యూడ్ పరుగు…

ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. నేడు న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ లో కూడా విజయం సాధించిన ఫైనల్ చేరాలని క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అంతే కాదు టీమిండియా మూడవసారి వరల్డ్ కప్ గెలవాలని భారతీయులంతా కోరుతున్నారు. తాజాగా తెలుగు బోల్డ్ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న రేఖా భోజ్ టీమ్ ఇండియాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు పోస్ట్ చేసింది. స్ట్రీకింగ్ అంటే వెస్ట్రన్ దేశాల్లో బీచ్ లో బట్టలు విప్పి సంతోషంతో పరిగెత్తడం. న్యూడ్ గా వైజాగ్ బీచ్ లో పరిగెడతా అంటూ రేఖా భోజ్ దుమారం రేపే వ్యాఖ్యలు చేసింది.

దీనితో నెటిజన్లంతా బట్టలు విప్పి పరిగెడతావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి రేఖా భోజ్ రిప్లై కూడా ఇచ్చింది. ఎలాగోలా ఫేమస్ అవ్వడం కోసం కొంతమంది సెలెబ్రిటీలు చేసే కామెంట్స్ ఇవి అని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనికి రేఖా భోజ్ రిప్లై ఇస్తూ.. లేదండి.. మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీం పై అభిమానంతో చెబుతున్నా. నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు.క్రికెట్ అనేది అల్టిమేట్ ఎమోషన్.. వరల్డ్ కప్ మూమెంట్ కి లిమిట్ లేదు అని సమాధానం ఇచ్చింది

Advertisement

తాజా వార్తలు

Advertisement