Saturday, March 2, 2024

ADB: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా, ఖానాపూర్ రూరల్ (ప్రభ న్యూస్) ఆగస్టు 15 : అప్పులబాధతో మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకొంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గ్రామానికి చెందిన బానవత్ వెంకటేశ్ (27) చేసిన అప్పులు తీర్చకపోవడంతో గత కొద్ది రోజులుగా మనస్థాపానికి గురయ్యాడన్నారు.

సోమవారం అర్ధరాత్రి ఇంట్లో అందరు పడుకున్న సమయంలో ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కుటుంబీకులు ఉదయం లేచి చూసే సరికి మృతిచెంది ఉన్నాడన్నారు. భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి ఓ కూతరు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement