Wednesday, May 1, 2024

Yellendu – కేసీఆర్ “ప్రజా ఆశీర్వాద సభ”ను మనమందరం కలిసి దిగ్విజయం చేద్దాం:ఎంపీ రవిచంద్ర

ఇల్లందులో వచ్చే నెల ఒకటవ తేదీన జరిగే బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”కు మనమందరం స్వచ్చంధంగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.రాష్ట్రాన్ని అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసిన, చేస్తున్న బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రసంగాన్ని శ్రద్ధ విని కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియకు ఘన విజయం చేకూర్చాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు.బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే “ప్రజా ఆశీర్వాద సభ”ను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలం ముచ్చర్లలో గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,డబ్బు సంచులతో వచ్చి మోసపు మాటలు చెప్పే దొంగల్ని నమ్మొద్దని,తమ మాదిరిగా వాళ్లు అందుబాటులో ఉండరన్నారు.వారిని పొరపాటున నమ్మితే ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందని,గోస పడ్తారని హితవు పలికారు.

ఇల్లందు నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులలో 90శాతానికి పైగా బీఆర్ఎస్ లోనే ఉన్నారని,కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలనే తపన ప్రజలలో కనిపిస్తున్నదన్నారు.పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే కాక రైతుబంధుతో పాటు ఉచితంగా కరెంట్,సాగునీళ్లిస్తున్న విషయాన్ని ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు.తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించారని, కేసీఆర్ ఈసారి కార్మికులకు 711కోట్లు బోనస్ అందజేశారన్నారు.తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసిన, చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అపూర్వ విజయం సాధించడం, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎంపీ రవిచంద్ర ధీమా వ్యక్తంచేశారు.అటుతర్వాత కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించడం ఖాయమని ఎంపీ వద్దిరాజు వివరించారు.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ,””వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”అనే నినాదాలు మిన్నంటాయి.

లోక్ స‌భ స‌భ్యురాలు మాలోతు క‌విత‌తో భేటి

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి సత్యవతి రాథోడ్, లోకసభ సభ్యురాలు మాలోతు కవితలతో గురువారం ఉదయం మహబూబాబాద్ లో సమావేశమయ్యారు.ఎంపీలు రవిచంద్ర,కవిత,జెడ్పీ ఛైర్మన్ అంగోతు బిందు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంగోతు శ్రీకాంత్,మూల మధుకర్ రెడ్డిలు మంత్రి సత్యవతి ఆహ్వానం మేరకు ఆమె నివాసంలో అల్పాహారం తీసుకుని, తేనీరు సేవించారు.ఈ సందర్భంగా వారు ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న తీరుతెన్నులు,ఇల్లందులో వచ్చే నెల ఒకటవ తేదీన జరిగే బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు “ప్రజా ఆశీర్వాద సభ”ను విజయవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు.

- Advertisement -

గార్ల మండ‌లంలో ర‌విచంద్ర ప‌ర్య‌ట‌న …

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం ఇల్లందు నియోజకవర్గం గార్ల మండల కేంద్రంలో పర్యటించారు.ఎంపీ రవిచంద్రను బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించిన విషయం తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా గార్లలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంగోతు శ్రీకాంత్,మూల మధుకర్ రెడ్డిలతో కలిసి సింగల్ విండో ఛైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ తదితరులతో సమావేశమై నవంబర్ ఒకటవ తేదీన ఇల్లందులో జరిగే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు”ప్రజా ఆశీర్వాద సభ”ను మనమందరం కలిసి దిగ్విజయం చేద్దామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement