Thursday, April 25, 2024

మాదాపూర్ లో కారు బీభత్సం… యువతి మృతి

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి సిగ్నల్ వద్ద ఆగివున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వున్న యువతి మృతి చెందగా, యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యువతి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన అజయ్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement