Monday, July 15, 2024

మీరు లేని జీవితం నాకు వ‌ద్దు – భ‌ర్త మ‌ర‌ణంతో భార్య ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : భ‌ర్త గుండెపోటుతో మ‌ర‌ణించ‌డంతో భార్య కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద సంఘ‌ట‌న హైద‌రాబాద్ లో జ‌రిగింది.. వివ‌రాల‌లోకి వెళితే వ‌న‌స్థ‌లిపురం వాసి మ‌నోజ్(31) వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌. అమెరికాలో డ‌ల్లాస్‌లో స్థిర‌ప‌డిన మ‌నోజ్.. ఏడాదిన్న‌ర క్రితం అంబర్‌పేట డీడీ కాల‌నీకి చెందిన సాహితీ(29)ని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన వెంట‌నే భార్య‌ను తీసుకొని, మ‌నోజ్ అమెరికా వెళ్లాడు. అయితే ఈ ఏడాది మే 2వ తేదీన త‌ల్లిదండ్రుల‌ను చూసేందుకు సాహితీ హైదరాబాద్‌కు వ‌చ్చింది.
మే 20వ తేదీన మ‌నోజ్ గుండెపోటుకు గురికాగా, స్నేహితులు చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌నోజ్ ప్రాణాలు కోల్పోయాడు. విష‌యం తెలుసుకున్న సాహితీ గుండెల‌విసేలా రోదించింది. 23వ తేదీన రాత్రి మ‌నోజ్ డెడ్ బాడీ వ‌న‌స్థ‌లిపురం చేరుకోగా, 24న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అంత్య‌క్రియ‌లు ముగిశాక సాహితీ త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి డీడీ కాల‌నీకి చేరుకుంది. భ‌ర్త మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని ఆమె నేటి ఉద‌యం 9:30 గంట‌ల‌కు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement