Friday, March 29, 2024

త్వ‌ర‌లోనే “స్క్విడ్ గేమ్” సీక్వెల్.. ఈసారి కాస్త వెరైటీగా

రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్‌తో నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌బస్టర్ గా మారిన‌ స్క్విడ్ గేమ్.. సీక్వెల్ తో త్వరలో OTTలో తిరిగి రానుంది. కొరియన్ వెబ్ సిరీస్ 2021లో OTT సంచలనంగా మారింది.. చిన్న పిల్లలు ఆడుకునే ఆటలతో అడగు అడుగు ప్రాణం కోసం పోరాడుతూ ఉత్కంఠనకు కలిగించే ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదలైన ఈ సిరీస్‌కు మన దేశంలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. చావు-బతుకులతో ఆట ఆడుతూ నడిపించే ఈ సిరీస్ నుంచి సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా స్క్విడ్ గేమ్ ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. స్క్విడ్ గేమ్‌ను సరికొత్త రూపంలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఇప్పుడు వ‌స్తున్న ఈ సీక్వెల్ సిరీస్ గా కాకుండా.. రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నెట్‌ప్లిక్స్ తెలిపింది. స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ అనే టైటిల్‌తో ఈ రియాల్టీ షోనూ రూపొందించనున్నారు. ఈ షో ని న‌వంబ‌ర్ లో ప్రేక్ష‌క‌లు ముందుకు తీసుకురానున్న‌ట్టు తెలుస్తోంది.. అయితే రిలీజ్ డేట్ పై మేక‌ర్స్ నుండి క్లారిటీ రావాల్సిఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement