Friday, May 3, 2024

తెలంగాణ‌లో పండే తెల్ల బంగారం.. అతి నాణ్యమైన‌ది.. మంత్రి కేటీఆర్

వరంగల్లో ప్రతిష్టాత్మక నెలకొల్పిన కాకతీయ మెగా మెగా టెక్స్టైల్ పార్కులో స్థానికులకే 99 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.శనివారం వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాంగణంలో దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించిన కంపెనీలను పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యో పత్తి భారతదేశంలోని అత్యంత నాణ్యమైన పత్తి అని, దాని ద్వారా నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులను తయారు చేయవచ్చని సూచించారు.

మేడిన్ వరంగల్ లో మేడిన్ పరకాలలో ఉత్పత్తి వస్త్రాలు భారతదేశంలోనే కాకుండా అమెరికా తదితర ప్రపంచ దేశాల్లో ఎగుమతి చేసే స్థాయిలో ఉంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు.ఇప్పటికే కిటెక్స్ కంపెనీ ఉత్పత్తులను మొదలు పెడుతుందని ఆ కంపెనీ ద్వారా 6 వేల మంది ఉపాధి లభించబోతుందన్నారు. గణేష్ కంపెనీ ద్వారా 1000 మందికి,యంగ్ వన్ పరిశ్రమ ద్వారా 21,000 మందికి ఉపాధి లభించబోతుందని మంత్రి అన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్కులో 80 శాతం మంది మహిళలకే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఆగస్టు 15 లోపు భూనిర్వాసితులందరికీ ప్లాట్లు ఇవ్వడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మరో రెండు నెలల్లో గణేష్ కిటెక్స్ పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమవుతాయని వాటిని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు.

భారతదేశంలో మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 30 శాతం అవార్డులను గెలుచుకుందని మంత్రి అన్నారు.తెలంగాణ ఆచరిస్తే భారతదేశం అనుసరిస్తుందని పేర్కొన్నారు.తెలంగాణలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పేరుతో ఏర్పాటు చేయబోతుందన్నారు. తెలంగాణ రైతుబంధును ప్రకటిస్తే కేంద్రం పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తుందన్నారు. ఇలా అనేక పథకాలకు భారతదేశానికి తెలంగాణ మార్గదర్శిగా మారింది అన్నారు. రాబోయే ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఆశీర్వదించాలని, అలాగే పరకాల నుంచి చల్లధర్మారెడ్డి గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు.నవంబర్ డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని, కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement