Monday, April 22, 2024

TS | సంతృప్తి ఎక్కడ ఉంటే అక్కడ సంపద ఉంటుంది: గరికపాటి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, (ప్రభ న్యూస్) : సంతృప్తి ఎక్కడ ఉంటే సంపద అక్కడ ఉంటుందనీ, మన కర్మ ఫలం ప్రకారం రాముడు నడిపిస్తున్నాడనీ ప్రముఖ ప్రవచన కారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, గరికపాటి నరసింహారావు అన్నారు. శ్రీ రాముని పాదాలకు మీ మనసును అంకితం చేయండి.. జీవితం బాగుం టుందనీ ఉద్బోధన చేశారు. జమ్మి ఆకులను బంగారంగా ఇచ్చే సంస్కృతి ఒక తెలంగాణలోని ఉంది.

కానీ ప్రస్తుతం బంగారాన్ని సైతం ఆకుల కింద పడేస్తున్న పరిస్థితి సంపన్నుల్లో ఉందని అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధర్మ బీజం పేరుతో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచన కారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement