Thursday, December 5, 2024

సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130వ‌ డివిజన్ పరిధిలోని రాంరెడ్డి నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను తన నివాసం వద్ద మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డితో పాటు సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులని, ఎటువంటి సమస్యలున్నా… తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సోమిషెట్టి వామన్ గుప్త, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు మాధవ రావు, రమేష్, జనరల్ సెక్రెటరీ రాజు, కోశాధికారి గోవింద రావు, ఆర్గనైజర్ బాబు, జాయింట్ సెక్రటరీలు రాజు, యాదగిరి గౌడ్, రాం చందర్, మల్లికార్జున్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement