Monday, April 29, 2024

December 31st: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ రంగనాథ్

హైదరాబాద్ నగర​ ట్రాఫిక్​ జాయింట్​ సీపీగా రంగనాథ్​ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన రంగనాథ్‌.. ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్​ జాయింట్​ సీపీగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ ఇబ్బందులపై గతంలో డీసీపీగా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగే ప్రయత్నం చేస్తానని తెలిపారు.

డిసెంబరు 31న ట్రాఫిక్​ ఆంక్షలపై మార్గదర్శకాలు విడుదల చేస్తానని చెప్పారు. వేగంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు మరింత విస్తృతం చేస్తామని రంగనాథ్​ తెలిపారు. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లతో పాటు ప్రమాదాల నివారణకు అన్ని  చర్యలు తీసుకుంటామని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.  నిబంధనలు అతిక్రమిస్తే వాణిజ్య సముదాయాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement