Friday, April 26, 2024

తెలంగాణ మోడ‌ల్ శ్రీరామ ర‌క్ష‌..ప‌థ‌కాలు, పాల‌సీలే అండ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచీ అభివృద్ధే అజెండాగా ముందడుగు వేసి, కొన్ని రంగాల్లో సాధించిన మెరుగైన ఫలితాలు, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు తిరుగులేని ఆయుధంగా పనికొస్తున్నాయి. ఉద్యమకాలం లో దాదాపు రెండు దశాబ్దాల పాటు పేదవర్గాలతో మమేకమై పనిచేసిన ఆయన అనుభవాలు, నేడు జాతీయస్థాయి రాజకీయాలకు దారి చూపి స్తున్నాయి. ఆయన మనసులో మెదిలిన మానసపుత్రికలు రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందడంతో కేసీఆర్‌లో ఆత్మబలం రెట్టింపు అయ్యింది. సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తెలంగాణాలో సాధించిన అభివృద్ధి, ఆర్థిక ఫలాలను చూపి, దేశ రాజకీ యాల్లో తన ముద్రను వేసుకోబోతున్నారు. ఇటు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా, దక్షిణాదిలో ఏఏ రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేసినా.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీలు చుర కత్తుల్లా ప్రచారానికి ఉపయోగపడుతాయని రాజకీయ విశ్లేషకులు, సామాజిక నిపుణులు అంచనా వేస్తున్నా రు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా జాతీయ రాజకీ యాల కోసం ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రజలకు మేలు చేస్తున్న ప్రతి పథకానికీ ఆధారాలు సేకరించారు. తెలంగాణ ప్రజల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి దోహదపడిన అన్ని కార్యక్ర మా లకూ తానే ఆద్యుడినన్న బలమైన భావనతో, గట్టి ధీమాతో ముందుకు సాగు తున్నారు. సహజ వనరుల సద్వినియోగం, తద్వారా దేశం గతిని మార్చే అవకాశాలు, ముఖ్యంగా వ్యవసాయరంగం అభ్యు న్నతికి దోహదపడే అంశాలను ఉటంకిస్తూ, ఖమ్మం బహిరంగ సభ వేదికగా కేసీఅర్‌ చేసిన ప్రకటనపై ఇప్పటికే జాతీయస్థాయిలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఇదే అంశాలపై మరింత లోతుగా వెళ్ళి దేశ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగానే జరుగుతోంది. బీఆర్‌ఎస్‌తో కలిసివచ్చే పలు ప్రాంతీయ పార్టీలకు కూడా ఇక్కడి పథకాలు, పాలసీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

కేసీఆర్‌కు కలిసివచ్చే అంశాలు
బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణకు అనేక అంశాలు కలిసివస్తున్నాయి. గ్రామ గ్రామాన బీటీ- రోడ్డు పనులు, ఇండస్ట్రీ పాలసీ, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయానికి చేయూత, కుల వృత్తులకు భరోసా, నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, విద్యా ర్థులకు సన్నబియ్యం, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, షీటీ-మ్స్‌, గొల్ల కుర్మ లకు గొర్రెల పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం ఫి-ట్‌ మెంట్‌, ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్‌నెస్‌ కేంద్రాలు, పోలీస్‌ సంక్షే మం, అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల జీతాలు పెంపు, ఆర్టీసీకి అండ దండలు తదితర పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర గామిగా నిలబెట్టడంలో సీఎం కేసీఆర్‌ పాక్షిక విజయం సాధించారు. ఒకేసారి 8 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించి ఘనతకెక్కారు. ఇదొక నూ తన అధ్యాయంగా ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల సంఖ్య 17 కు చేరింది. 2023 సంవత్సరానికి మొత్తం 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీ లు ఏర్పాటు- చేసే దిశగా చర్యలు కొన సాగుతున్నాయి. అలాగే కేసీఆర్‌ కిట్‌ ద్వారా మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీ యేతర పార్టీలన్ని బీఅర్‌ఎస్‌ నేతృత్వంలో కలిసే నడిచే అవకాశం ఉంది. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్‌ ముందుకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు.

జాతీయస్థాయిలో ఆకట్టుకుంటున్న ”దేశమంతా రైతుబంధు”
ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభావేదికగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చేసిన మరో కీలక ప్రకటన ”దేశమంతా రైతుబంధు” అజెండాలో ఆయుధం కాబొతోందని విశ్లేషకులు చెబుతున్నారు. రైతు బంధు పథకం ద్వారా రెండు పంటలకు కలిపి పెట్టు-బడి సాయాన్ని రూ.10 వేలు అందిస్తుంది. ఈ యాసంగికి 10వ విడత రైతు బంధు నిధులు రైతు ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే ఇప్పటి వరకు రూ.65 వేల కోట్లు రైతు బంధు ద్వారా రైతు ఖాతాల్లో జమ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. రాష్ట్రం సొంత ఆదాయంలో మనమే నంబర్‌ వన్‌ .. 2014లో రూ.29,288 కోట్లు- కాగా ఇప్పుడు 2021-2022 నాటికి రూ.92,910 కోట్లకు ఆదాయం పెంచుకున్నము. ఈ సంవత్సరం 90 వేల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలై ఉద్యోగాల నియామకం ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. ఇవే కాక వైద్య, విద్య, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ శాఖల్లో అదనంగా ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపట్టిన విషయాన్ని ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లోని బహిరంగ సభల్లో కేసీఆర్‌ విస్తృత ప్రచారం చేయబోతున్నారు.

జాతీయ అజెండాలో మరో కీలక అంశం
వెలుగులు చిమ్ముతున్న రాష్ట్రంగా తెలంగాణకు ముద్ర పడడంతో దేశ రాజకీయాల్లో రాణించేందుకు ఈ అంశం కూడా కేసీఆర్‌ జాతీయ అజెండాలో ప్రత్యేకతను చాటుకోనుంది. దామరచర్ల ప్లాంట్‌ సిద్ధమైంది. ఈ ఏడాది మార్చి నాటికి 9,450 మెగావాట్ల సామ ర్థం విద్యుత్‌ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యా యం రాసుకుంటు-న్నాము. కోటి ఎకరాలకు పంట సాగు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. తెలంగాణలో 2022 నాటికి అన్ని పంటలు కలిపి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.50 కోట్ల టన్నులకు చేరింది. 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పంటసాగు విస్తరణ పెరిగింది. బియ్యం ఉత్పత్తిలో సైతం 2021లో 1.02 కోట్ల ఉత్పత్తి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచి దేశానికి అన్నం పెడుతోంది. గోడౌన్ల సంఖ్య 68.28 లక్షల టన్నుల సామర్థంకు పెంచుకున్నాము. ఖరీఫ్‌ సీజన్‌ లో రైతులు పండించిన ధాన్యాన్ని 7 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు- చేసింది. 1 కోటి 7 లక్షల 748 కోట్ల విలువైన 6 కోట్ల 6 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత తెలంగాణ దక్కిం చుకుంది. రూ.36 వేల కోట్లతో నాణ్యమైన విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ దేశానికి మార్గదర్శి కాబోతుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement