Tuesday, March 28, 2023

ప‌ల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

పెళ్లి బృందం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైన ఘ‌ట‌న పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పెళ్ళి బృందం ముటకూరు నుంచి శిరిగిరిపాడుకు స్కార్పియో వాహ‌నంలో వెళ్తుండగా వెల్దుర్తి వ‌ద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా.. మరో ఆరుగురుకి గాయాల‌య్యాయి. వెంట‌నే వీరికి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రమాదంలో సమయంలో కారులో 9 మంది ఉన్నారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement