Wednesday, May 1, 2024

TS: బీఆర్ఎస్ తోనే మైనార్టీల సంక్షేమం.. హోంమంత్రి మహమూద్ అలీ

ముస్లిం మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలియజేశారు. బుధవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. షాదీ ముబారక్ తో నిరుపేద ఆడపిల్లల వివాహానికి చేయూతనందిస్తున్నారన్నారు.

మైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 50ఏళ్లు పరిపాలించినా ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసారని, వారి సంక్షేమం కోసం కృషి చేయలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మైనార్టీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ముస్లిం మైనారిటీలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న దాసరి మనోహర్ రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement