Sunday, April 28, 2024

TS: మగ్గం నేసి.. డప్పు కొడుతూ.. మంత్రి గంగుల ప్రచారం..

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ.. ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శనివారం నియోజకవర్గంలోని చేగుర్తి గ్రామంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా మగ్గం నేసి.. డప్పు కొట్టి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ… నిరుపేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని, కరీంనగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శం నియోజకవర్గంగా తీర్చిదిద్దానన్నారు.

సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మార్చి పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మితే మోసపోతారని, అధికారం కోసం ఆరు గ్యారెంటీలోని దొంగ హామీలు ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని కరీంనగర్ లో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement