Friday, April 26, 2024

తెలంగాణకు మూడు రోజుల పాటు వర్షాలు..!

తెలంగాణ లో మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగా రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురువొచ్చని తెలుస్తోంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement