Thursday, April 25, 2024

ఆరోగ్య కార్యకర్తలకు అండగా ఉంటాం : కలెక్టర్‌ పాటిల్‌

కామారెడ్డి, (ప్రభన్యూస్‌): . సదాశివనగర్‌ మండలం ఉత్తునూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ వి. పాటిల్‌ సందర్శించారు. ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ అన్నారు. పెద్ద పోతంగల్‌ ఆరోగ్య కార్యకర్త సావిత్రి పై దాడి జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయడానికి వెళితే తనపై దాడి చేశారని ఆరోగ్య కార్యకర్త సావిత్రి తెలిపారు. ఆ విష‌యం పై క‌లెక్ట‌ర్ పాటిల్ సావిత్రిని ప‌రామర్శించారు.

దాడులకు భయప డవలసిన అవసరం లేదని సూచించారు. దాడి చేసిన వారిపై క‌ఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించి 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాయవ్వ, ఎంపీటీసీ రామచంద్ర రావు, ఉప సర్పంచ్‌ శివ పాటిల్‌, వైద్యాధికారి హరికష్ణ, డిప్యూటీ డిఎంఅండ్హెచ్‌ఓ శోభారాణి, పంచాయతీ కార్యదర్శి దేవి సింగ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement