Tuesday, April 30, 2024

Dubbaka – కలుషిత నీరు తాగి ఒక‌రి మృతి … 50 మందికి పైగా అస్వ‌స్థ‌త

ప్రభ న్యూస్, సిద్దిపేట బ్యూరో: దుబ్బాక మండలంలో కలుషిత నీరు తాగి పలువురు అస్వస్థత కు గురి కాగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. దుబ్బాక మండలం పద్మశాలి గడ్డకు చెందిన సునుగురు కుంటయ్య( 65) వాంతులు , విరోచనాలతో అస్వస్థకు గురికాగా కుటుంబ సభ్యులు దుబ్బాక ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుంటయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.

బాధితులకు పరామర్శ…
కలుషిత నీరు తాగి అస్వస్థకు గురైన నల్లరింగ్ గడ్డ, పద్మశాలి గడ్డ , దుంపలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 50 మంది బాధితులు దుబ్బాక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని దుబ్బాక్ ఎమ్మెల్యే రఘునందన్ రావు , కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక జెడ్పిటిసి రవీందర్ రెడ్డిలు పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement