Friday, May 3, 2024

స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర‌కు ప్ర‌త్యేక బృందాలు : హ‌రీశ్ రావు

సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రత్యేక బృందాలు పెడతామ‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. ఈరోజు వరంగల్ జిల్లాలో ఎం.జీ.ఎం హాస్పిటల్లో పిల్లల కోవిడ్ ప్రత్యేక సంరక్షణ విభాగం, ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో పిల్లల కోవిడ్ ప్రత్యేక సంరక్షణ విభాగం, టి.బి హాస్పిటల్లో ప్రత్యేక వార్డు, మథర్ మిల్క్ బ్యాంక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ప్రారంభించి, హన్మకొండలో టి. డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు కోసం మంత్రులు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మేల్యేలు నరేందర్, అరూరి రమేష్, శంకర్ నాయక్ ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ…. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో వైద్య ఆరోగ్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరిన మేరకు వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు శ్రీనివాస్, వాకాటి కరుణలను పంపించి కావలసిన వసతులు ఏర్పాటు చేయిస్తానని మంత్రి హరీష్ రావు తెలిపారు. వరంగల్ నేతలు కోరినట్లు త్వరలోనే రెండు రోజుల పాటు వరంగల్, హనుమకొండలో ఉండి వైద్య ఆరోగ్య శాఖపై పూర్తి స్థాయి సమీక్ష చేస్తానన్నారు. హనుమ కొండ కొత్త జిల్లాలో 3.5 కోట్ల రూపాయలతో టి.డయాగ్నస్టిక్ సెంటర్, రేడియాలజీ లాబ్, ఇచ్చామ‌ని, వచ్చే నాలుగు నెలల్లో పూర్తి చేస్తామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement