Monday, April 29, 2024

అధికారుల నిర్ల‌క్ష్యంతో రోడ్డంతా జలమయం : తుమ్మల వెంకటరెడ్డి

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరలోని పసర నుండి మేడారం వెళ్ళు రహదారిపై సీపీఎం పార్టీ కార్యాలయం ముందు పసర గ్రామంలో ఇటీవల కురిసిన చిన్న వర్షానికి రోడ్డంతా జలమయంగా మారి బాటసారులకు, భక్తులకు ఇబ్బందికరంగా మారిందని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జలమయమైన రోడ్డును పరిశీలించిన‌ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… రోడ్డు వేసే క్రమంలో గుత్తేదారు గుమస్తా కు అటువైపు ఇటువైపు ఎత్తు ఉండి ఇక్కడ లోతు ఉన్నదని పేర్కొంటూ మీరు ఇక్కడ ఎత్తు లేపాలని పదే పదే చెప్పినా నిర్లక్ష్యం చేస్తూ అధికారుల చెప్పిన విధంగా చేస్తున్నామని పేర్కొంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఇంకా వర్షాలు ఎక్కువ పడితే ఈ రోడ్డు వెంట ఎవరు నడవరని, రోడ్డు దెబ్బతింటుందని, వెంటనే మరమ్మతులు చేపట్టి, నీరు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేనియెడల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొదిలి చిట్టి బాబు, సోమ మల్లారెడ్డి, సంజీవ, వ్యాపారస్తులు గణేష్ రాజేశ్వరి, సుమన్, అభిలాష్, రమేషు, బాబు, ఐలయ్య, పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement