Saturday, October 12, 2024

Mulugu – ఆంధ్రా నుంచి తెలంగాణలోకి భారీగా నకిలీ మిరప విత్తనాలు …

నూగురు వెంకటాపూర్’ జూన్ 2,( ప్రభ న్యూస్,) : మార్కెట్లో మిరప విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నది. అందులోనూ యూ ఎస్ 341 రకానికి బాగా డిమాండ్ ఉన్నది. యూ ఎస్ 341 రకానికి ఉన్న డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారస్తులు నకిలీ విత్తనాలకు తెరలేపారు. 3 4 1 స్థానంలో 3341 పేరుతో నకిలీ విత్తనాలను ములుగు జిల్లా నూగురు వెంకటాపూర్ ఏజెన్సీలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఏజెన్సీ రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వ్యాపారులు నకిలీ విత్తనాలతో బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో 3341 రకాన్ని దళారులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు. రైతులు యూఎస్ 3 4 1 రకం విత్తనాలు అని మోసపోయి కొనుగోలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు విత్తనాలను నియంత్రించాల్సిన వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖలు నిద్ర మత్తులో ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నకిలీ విత్తనాలను అరికట్టకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

అసలే మిర్చి విత్తనాలు దొరకక నానా ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ నేపథ్యంలో రైతులకు కుచ్చు టోపీ పెడుతున్న నకిలీ వ్యాపారస్తులు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలోని వి ఆర్ కే పురం పంచాయతీలోని గ్రామాల్లో మిర్చి విత్తనాలను ఎలాంటి లైసెన్సులు లేకుండా ఎలాంటి బిల్లులు లేకుండా మిర్చి విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు కేవలం 48 వేల రూపాయలకే త్రీ ఫోర్ వన్ విత్తనాలు ఇస్తామంటూ ఆ నెంబర్ ఎంత డబల్ త్రీ ఫోర్ వన్ విత్తనాలను అంటగడుతున్నారు మార్కెట్లో త్రీ ఫోర్ వన్ విత్తనాలకు మంచి డిమాండ్ ఉండడంతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని 3341 విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోవడం విశేషం ఎంతో కష్టపడి రైతు సాగు చేసిన తర్వాత పంట పండగ పోతే ఎవరిని అడగాలి రైతు వ్యవసాయ అధికారులు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోకపోతే రైతులు మోసపోయే అవకాశం ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement