Friday, July 26, 2024

మాట తప్పలే.. మడమ తిప్పలే.. అనుకున్నది సాధించిన ఎమ్మెల్యే నరేందర్

వరంగల్: వరంగల్ లోని ప్రముఖ చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం నడపనుంది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం.44) వెలువడ్డాయి. ఈ క్రమంలో కళాశాల కమిటీ ప్రతినిధులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను క్యాంపు ఆఫీసులో కలుసుకున్నారు. తమ కళాశాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకునేవిధంగా కృషి చేసి, ఆ మేరకు ఉత్తర్వులు వెలువడడానికి కారణమైన ఎమ్మెల్యేను కళాశాల కమిటీ శాలువాతో సత్కరించి సంతోషం వ్యక్తం చేసింది. కమిటీ ఉపాధ్యక్షుడు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సుధాకర్ రెడ్డి, కమిటీ మెంబర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.కృష్ణమూర్తి, కమిటీ మెంబర్ చందా శ్రీకాంత్, ప్రిన్సిపాల్ డాక్టర్ శశిధర్ రావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ధర్మారెడ్డి, లైబ్రేరియన్ ఎస్.అనిల్ కుమార్, సూపరింటెండెంట్ గాండ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యేను కలుసుకున్న వారిలో ఉన్నారు.


1967లో ప్రారంభం..
సీకేఎం కళాశాల 1967లో ప్రారంభమై 1973 వరకు ప్రైవేట్ కళాశాగా కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని ఎయిడెడ్ కళాశాలగా మార్చింది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నం ఫలించి తాజాగా విద్యాశాఖ పరిధిలోకి తెచ్చి ప్రభుత్వ కళాశాలగా మార్చారు. ఇకపై ఇక్కడ పనిచేస్తున్న 9మంది ఎయిడెడ్ సిబ్బంది ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నారు. ఇక నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ ద్వారా 67 మంది బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వమే వేతనాలు ఇవ్వనుంది.


సీఎం ఆశీస్సులతో..
రెండేళ్ల ప్రయత్నం ఫలించింది : ఎమ్మెల్యే నరేందర్
సీకేఎం కళాశాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకు రావడానికి రెండేళ్లుగా తాను విశ్వప్రయత్నాలు చేసినట్లు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. కళాశాల కమిటీ తనను కలుసుకొని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావల్సిందిగా కోరడం, అందుకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి పలుమార్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలుసుకున్నట్లు తెలిపారు. కళాశాల ప్రతిష్టను ముఖ్యమంత్రికి వివరించి ప్రభుత్వం టేకోవర్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి సమ్మతించగా తగు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రయత్నంలో తాను సఫలీకృతం కావడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. అలాగే తనకు సహకరించిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్, మధుసూదనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement