Friday, May 3, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో తన బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ని ప్రారంభించిన విజయ్ దేవరకొండ

హైదరాబాద్ : భారతీయ నటుడు, యువత గుండెచప్పుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ది దేవరకొండ బ్రాడ్‌కాస్ట్ అనే పేరుతో సరికొత్త ప్రసార ఛానెల్‌ను ప్రారంభించి, తన అభిమానులు, అనుచరులకు మరో అడుగు చేరువయ్యారు. ఈ ఛానెల్ ద్వారా, విజయ్ రాబోయే తన సినిమాల గురించి మరికొంత ప్రత్యేకమైన కంటెంట్‌ను అభిమానులతో పంచుకోనున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని సరికొత్త ఫీచర్‌లలో బ్రాడ్ కాస్ట్ ఛానెల్స్ అనేవి ఒకటి కాగా, ఇది క్రమంగా భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.

ఈసంద‌ర్భంగా తన ఛానెల్‌ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…. ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ని ప్రారంభిస్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నాన‌న్నారు. ఇది త‌న అభిమానులకు మరింత దగ్గరగా ఉండేందుకు, త‌న సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వాయిస్ నోట్స్, తెరవెనుక కంటెంట్‌ను పంచుకునేందుకు ఒక మార్గమ‌న్నారు. మీ అందరినీ అక్కడ చూడాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. అభిమానులు ఆయన స్టోరీ స్టిక్కర్ లేదా ప్రొఫైల్‌కు పిన్ చేసిన లింక్ ద్వారా మొబైల్‌లో విజయ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌కి లింక్‌ను యాక్సెస్ చేయవచ్చన్నారు. లేదా ఇప్పటికే ఉన్న ఫాలోయర్‌గా ఉన్నవారికి ఛానెల్‌ని ప్రారంభించినప్పడు ఒక నోటిఫికేషన్ అందుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement