Friday, May 3, 2024

ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల.. 77 శాతం ఉత్తీర్ణత

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. ఈఏడాది ఫిబ్రవరినెలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు నిర్వహించగా, రెగ్యులర్‌ పరీక్షల్లో మొత్తం 77శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 127 మంది డిస్టింక్షన్‌ రాగా, 2,240 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారు. మిగిలిన 1767 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. మొత్తం 5,369 మంది విద్యార్థులు హాజరుకాగా, 4,134 మందిఉత్తీర్ణత సాధించారని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వై. మల్లేశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. కెఎన్‌ఆర్‌యు హెచ్‌ఎస్‌. తెలంగాణ. జీఓవి.ఇన్‌లో చూడవచ్చని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement