Sunday, April 21, 2024

ఖమ్మం సభను విజయంతం చేయాలి.. సత్యవతి రాథోడ్

ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ భారీ బహిరంగ సభ జన సమీకరణ నేపథ్యంలో జరిగిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ సభకు జనాన్ని భారీగా తరలించాలన్నారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, నూకల నరేష్ రెడ్డి, బీరవెళ్లి భరత్ కుమార్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement