Sunday, March 26, 2023

ఆర్టీసీ డ్రైవ‌ర్ కిడ్నాప్ – పోలీస్ యాక్ష‌న్ తో సుఖాంతం..

హైద‌రాబాద్ – అప్పుకు హామీగా ఉన్న పాపానికి ఒక ఆర్టీసీ డ్రైవ‌ర్ కిడ్నాప్ కు గుర‌య్యాడు.. ఈ ఘ‌ట‌న‌ హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన వెంకటేశ్ దిల్‌సుఖ్ నగర్-2 డిపోలో తాత్కాలిక డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సంగారెడ్డికి చెందిన నవీన్ వద్ద కొంత కాలం వెంకటేశ్ స్నేహితుడికి హామీ కింద అప్పు ఇప్పించాడు. ఈ క్రమంలో వెంకటేశ్‌ స్నేహితుడు తీసుకున్న అప్పు నవీన్‌కు సకాలంలో పూర్తిగా చెల్లించలేదు. పైగా ఫోన్‌ చేసిన స్పందించడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన నవీన్ తన స్నేహితులతో కలిపి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్‌ను కిడ్నాప్ చేయించాడు. దీంతో వెంకటేశ్‌ కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఏరియాలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్లను గుర్తించి, అరెస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement