Monday, April 29, 2024

WGL: పల్లెల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం… ఎమ్మెల్యే గండ్ర

చిట్యాల, అక్టోబర్ 5 (ప్రభ న్యూస్ ): పల్లెల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిరంతరం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. జడలపేటలో రూ.50లక్షలతో ఆర్ అండ్ బి రోడ్డు వెంట సైడ్ డ్రైన్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రామచంద్రపురంలో రూ.10లక్షలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. నవాబుపేటలో రూ.10లక్షలతో సీసీ రోడ్లు, రూ.10లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్, రూ.50లక్షలతో ప్రధాని రహదారి వెంట సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దసరా పండుగకు అందిస్తున్న బతుకమ్మ కానుక బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, ఎంపీపీ దావు వినోద, జడ్పిటిసి గొర్రెసాగర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు రత్నాకర్ రెడ్డి, హజ్రా బేగం, కసిరెడ్డి సాయి సుధా,పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement