Tuesday, May 14, 2024

కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. కాలేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 12.090 మీటర్ల ఎత్తులో ప్రాణహిత , గోదావరి నదుల కలయిక ప్రవహిస్తున్నది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 9,89,630 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 9,89,630 క్యూసెక్కులు ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 1,07,320 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 1,07,320 ఉంది. సరస్వతి బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటిమట్టం తో నిండుకుండలా కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement