Sunday, April 28, 2024

Wgl: దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం.. చీఫ్ విప్ వినయ్ భాస్కర్

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ లు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పోరాట యోధులను స్మరించుకునేందుకు సమావేశ హాల్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిసేలా ప్రభుత్వమే అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్న తమను చూసి అనేకమంది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటూ హేళన చేస్తూ నవ్వేవారు.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందని నిరూపించామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పేరిట అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి గురించి ఆనాటి ఉద్యమకారుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు ప్రస్తావించేవారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ కుమార్, బీసీ సంక్షేమ అధికారి రాంరెడ్డి టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రావు, దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement