Monday, June 10, 2024

కార్మికులను మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ,సింగరేణి కార్మికులకు మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కార్మికులకు సరైన సదుపాయాలు కల్పించాలని, సింగరేణి సంస్థని ప్రవేటికరణను నిరసిస్తూ శుక్రవారం ఐఎన్టియుసి ఆధ్వర్యంలో కెటికె 8 ఇంక్లైన్ లో ఏర్పాటు చేసిన గేట్ మీట్ లో భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు సరైన సదుపాయాలు కల్పించాలని, సింగరేణి హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న వైద్యులను భర్తీ చేయాలని  డిమాండ్ చేశారు. సింగరేణి సేఫ్ నిధులు కార్మికుల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగించాలని సింగరేణి సంస్థ, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, సంస్థలను ఆదాని, అంబానీలకి అప్పగించాలని చూస్తున్నాయన్నారు. మోడీకి కెసిఆర్ పరోక్షంగా మద్దతు ఇస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రజలు, కార్మికుల దృష్టి మళ్ళిచడం కోసం టిఆర్ఎస్ నిరసనలు ధర్నాలు చేస్తు మోసం చేస్తున్నారన్నారు.

అదేవిధంగా రైతులు పండించే యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో టిఆర్ఎస్ రైతులను తప్పుదోవ పట్టించడం కోసమే నిరసనలు, ధర్నాలు,దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికుల, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇంతకు ముందు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే  విఫలం అయ్యారని, ఇవన్నీ గమనించి రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం అందరం రైతు బిడ్డలం అని  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం రైతు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగ భర్తీ పై అని తెలిపారు. లక్ష కోట్ల రూపాయల తో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల మన నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం ఏమి లేదని అన్నారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు విషయంలో నిరసనలు చేస్తున్న టిఆర్ఎస్ పక్క రాష్ట్రాలు రాష్ట్ర పన్ను మినహాయింపు ఇస్తున్న విధంగా  తెలంగాణ రాష్ట్రములో ఇవ్వకుండా మోసం చేస్తున్నార అని కార్మికులు ఇవి అన్ని గమనించి రాబోయి రోజుల్లో జరిగే కార్మిక సంఘాల ఎన్నికలో ఐన్టియుసిని గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement