మహబూబాబాద్ : మతపరమైన అలజడి సృష్టించే నాయకులకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ స్థాపించే పార్టీ దేశానికి ఎంతో అవసరముందని చెప్పారు. మహబూబాబాద్‌లోని తన నివాసంలో మంత్రి సత్యవతి మీడియాతో మాట్లాడారు. దేశ సంపదను కొద్దిమందికి దోచిపెట్టి అన్ని వస్తువుల ధరలను పెంచుతున్న మోదీకి ప్రజలు గుణపాఠం చెబుతారని చెప్పారు.
మోదీ మత చిచ్చు దేశ హద్దులు దాటి ప్రపంచంలోకి ప్రవేశించిందని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కరెంట్ సమస్యను ఎదుర్కొంటుండగా, సీఎం కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణలో అది ఉత్పన్నం కాలేదన్నారు. కేసీఆర్ చేపట్టిన ప్రతిపనికి ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతునిచ్చారని తెలిపారు. గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా కేంద్రానికి పంపించామని, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇక్కడున్న గిరిజనులను బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మతపరమైన అలజడి సృష్టించే నాయకులకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి : మంత్రి సత్యవతి
Advertisement
తాజా వార్తలు
Advertisement