Friday, December 6, 2024

పోలీస్ కమిషనరేట్ వద్ద బీజేపీ నేతల ఆందోళన.. 30 మంది అరెస్ట్..

వరంగల్ : సామాజిక మాద్య‌మంలో పోస్ట్ చేశారని జర్నలిస్ట్ అరెస్ట్ విషయంలో బీజెేపీ నాయకులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ ను కలిసేందుకు వెళ్లగా 30 మంది కార్యకర్తలను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేసి రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ స్థానిక నాయకులు మాట్లాడుతూ.. ప్రశ్నించిన జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన నుంచి అన్ని లీకేజీలను దుయ్యబట్టారు. అసమర్ధ ప్రభుత్వానికి తోడు అధికారుల పనితీరు ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతి పక్షాలు నోరు నొక్కి అందుకే అరెస్టులు చేస్తున్నారని అరెస్టులు భయపడేది లేదన్నారు. రాత్రంతా చీమలు దోమల మధ్య గడపామని నిద్ర ఆహారం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా ఇవ్వలేకనే ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement