Saturday, February 24, 2024

TS: పెంబర్తి చెక్ పోస్ట్ వద్ద వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ

వరంగల్ : తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్ కమిషనరేట్ పోలీసుల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సిద్దమయ్యారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ సోమవారం అర్ధరాత్రి జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీల తీరును పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులపై పోలీస్ కమిషనర్ చెక్ పోస్ట్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ జనగామ రైల్వే స్టేషన్ లో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలను పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement