Sunday, June 9, 2024

Warangal – బీజేపీకి బిగ్ షాక్ – బిఆర్ఎస్ లో చేరిన సీనియ‌ర్ నేత‌లు

వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పాక సుధాకర్ మరియు బెస్త సంఘం మహిళా అధ్యక్షురాలు,గతంలో కార్పొరేటర్ గా పోటీ చేసిన పొక్కుల సరోజన,తానం శ్రీనివాస్,జన్ను ప్రభాకర్ నేడు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సుధాకర్ తో పాటు వారి బృందం గత 33 సంవత్సరాలుగా బిజెపికి సేవలందించి పార్టీలో డివిజన్ అధ్యక్షులుగా,బీజెవైఎం సెక్రటరీగా మరెన్నో పదవులు చేపట్టి నేడు తెలంగాణ పట్ల మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని సహించలేక కేసీఆర్ నాయకత్వం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారి అభివృద్ధిని చూసి వారి వెంట నడవాలని నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు

మ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ పట్ల మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు నచ్చక నేడు కేసీఆర్ తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేస్తున్న తీరు వారి నాయకత్వంలో తాము చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పాక సుధాకర్ మరియు వారి బృందం నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని 33 సంవత్సరాలు సేవలందించిన నాయకులు సైతం బిజెపి పార్టీని వద్దనుకొని బిఆర్ఎస్ లో చేరడం ఏదైతే ఉందో బిజెపి ప్రభుత్వం తెలంగాణ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు అనడానికి నిదర్శనమన్నారు. కెసిఆర్ నాయకత్వంలో సుధాకర్ మరియు పార్టీలో చేరిన వారందరికీ పార్టీలో సమచిత స్థానం కల్పిస్తామని ఏళ్ల వేళలా అందుబాటులో ఉంటానని కేసీఆర్ నాయకత్వం అహర్నిశలు శ్రమించి బిఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు.

జెడ్ఆర్సిసి మెంబెర్ చింతాకుల సునీల్,బి ఆర్ఎస్ నాయకులు కుచన క్రాంతి కుమార్, చెమ్మబోయిన విమల,కంట నిర్మల,బొల్లోజు సుధాకర్ తదితరులు హాజరయ్యారు

Advertisement

తాజా వార్తలు

Advertisement