Friday, May 17, 2024

TS: ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వికాస్ రాజ్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)గా వికాస్‌ రాజ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. హైదరాబాద్ లోని బుద్ధ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు అధికారులు హాజ‌రై.. వికాస్ రాజ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

1992 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన వికాస్‌ రాజ్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా నియ‌మిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి ప్రమోద్‌కుమార్‌ శర్మ ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన సంగ‌తి తెలిసిందే. సీఈవోగా ఉన్న శశాంక్‌ గోయల్‌ కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లడంతో ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీగా ఉన్నది. ఇంచార్జి సీఈవోగా అడిషనల్‌ సీఈవో బుద్ధప్రకాశ్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేథప్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి సీఈవోగా వికాస్‌రాజ్‌ను నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement