Saturday, December 7, 2024

Breaking: విజిలెన్స్ తనిఖీలు.. కాలేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల రికార్డుల పరిశీలన

తిమ్మాపూర్, ఎన్టిపిసి (ప్రభ న్యూస్) : ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు రికార్డుల తనిఖీ నిర్వహిస్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఎల్ఎండీలోని ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఎన్టిపిసి లోని ఎస్ఈ కార్యాలయంలో విజిలెన్స్ అదనపు ఎస్పీ బాలకోటయ్య ఆధ్వర్యంలో రికార్డులు పరిశీలిస్తున్నారు.


కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోణలపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement