Saturday, May 4, 2024

Breaking: రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర.. తెలుగులోనే ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులోని తన కార్యాలయంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు.. రవిచంద్రతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీలు కే. కేశవరావు, నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఎంపీ రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన బండ ప్రకాశ్‌ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానంలో రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement