Friday, May 17, 2024

HYD: జువైనల్ హోంను సందర్శించిన యూనిసెఫ్ బృందం…

హైదరాబాద్ తూర్పు ప్రతినిధి, సెప్టెంబర్ 12: సైదాబాద్ లోని ప్రభుత్వ బాలుర గృహo(జువైనల్ హోం)ను యూనిసెఫ్ బృందం సందర్శించారు. హోంలో ఉండే అనాథలు, పట్టుబడ్డ వీధి బాలలు, బాల కార్మికులకు అందుతున్న విద్య,వైద్య సదుపాయాలు, స్వయం ఉపాధి శిక్షణ, అందిస్తున్న వసతి, సౌకర్యాలను పరిశీలించారు. గత ఆరు సంవత్సరాలలో 200మంది క్లిష్ట తరమైన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని హోమ్ అధికారులు తెలిపారు.

అంతే కాకుండా చిన్న తనంలో ఇంట్లో నుంచి వచ్చిన పిల్లలు, మానసిక బాలురు 30మంది తల్లిదండ్రుల ఆచూకీ అతి కష్టం మీద కనుగొని అప్పగించడం జరిగిందని వివరించారు. హోం పనితీరును యూనిసెఫ్ బృందం ప్రశంసించారు. ఈ సందర్భంగా హోం చిన్నారులతో ముచ్చటించారు. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మీర్జారజా అలీ బేగ్, సూపరింటెండెంట్స్ నాగేశ్వరరావు, అప్జల్ షా, సంగమేశ్వర్, నవీన్ కుమార్, కృష్ణ వేణి, యూనిసెఫ్ ప్రతినిధులు మురళి, డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement