Thursday, May 23, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత.. ఇద్దరు విదేశీయుల అరెస్ట్

శంషాబాద్ (ప్రభ న్యూస్): గుట్టుచప్పుడు కాకుండా ఇతర దేశాల నుండి హైదరాబాద్​కు కొకైన్ తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు డీఆర్ఐ అధికారులు. విదేశాల నుండి కొకైన్ అక్రమంగా తరలిస్తున్నరని పక్కా సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాటువేసి ఇద్దరు వేరు వేరు ప్రయాణికుల వద్ద 80 కోట్ల విలువ చేసే 8 కిలోల కొకైన్​ స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్​ఐ అధికారులు తెలిపారు. కేప్ టౌన్ నుండి దుబాయ్ మీదుగా హైదరాబాదుకు బిజినెస్ వీసా మీద వస్తున్న ఓ ప్రయాణికురాలు వద్ద 4 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

అంగోలా మొజాంబిక్ – లుసాకా – దుబాయ్ నుండి టూరిస్ట్ వీసాపై హైదరాబాద్ వచ్చిన మరో మహిళా ప్రయాణికురాలు వద్ద మరో 4 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికులు కొకైన్ ప్యాకెట్లను ట్రాలీ బ్యాగులను దాచి అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు డిఆర్ఐ అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రయాణికుల వద్ద 80 కోట్ల విలువజేసే 8 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement