Saturday, April 20, 2024

రంజాన్‌ సందర్భంగా రేపు ఈక్విటీ మార్కెట్లకు సెలవు.. బుధవారం నాడే తిరిగి తెరుస్తారు..

త్వరలో జరగనున్న అమెరికా ఫెడ్‌ సమావేశాలు పెట్టుబడిదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నది. ఫెడ్‌ రేట్లను భారీగా పెంచనున్నట్లు వస్తున్న వార్తలే ఇందుకు కారణం అని చెప్పుకోవచ్చు. డాలర్‌ సూచీ పెరగడం, ఎఫ్‌ఐఐలో అమ్మకాల ఒత్తిడి, కమోడీటీ ధరలు పెరగడం వంటివి రిస్క్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. అయితే, జీఎస్‌టీ వసూళ్లు, ఆటో అమ్మకాలు వంటివి ఆర్థిక రంగంపై ఆశలను చిగురింపజేశాయి అని అన్నారు జియోజిట్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రిసెర్చ్‌ సెంటర్‌ అధినేత వినోద్‌ నాయర్‌ తెలియజేశారు. ప్రపంచ షేర్ల ధరలు కూడా సోమవారం నాడు తగ్గిపోయాయి.

ముఖ్యంగా చమురు బ్యారెల్‌ ధర మూడు డాలర్ల వరకు తగ్గింది. రష్యా నుంచి చమురు సరఫరా, ఆంక్షల గురించి చర్చించడం కోసం యూరోపియన్‌ ఎనర్జీ మంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం సంభవించింది. సెలవుల కారణంగా చైనాతో సహా అనేక ఆసియా మార్కెట్లు, బ్రిటన్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ నిలిచిపోయింది. జపాన్‌లోని కీలకమైన సూచీ నిక్కీ 225 కూడా తిరోగమనంలోనే సాగింది, దాదాపు 0.1 పాయింట్లు తగ్గి 26,818.53 పాయింట్లకు చేరుకున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement